అక్షరటుడే, ఎల్లారెడ్డి: తిరుమలలో లింగంపేట వాసులు భజనలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానం మేరకు లింగంపేట నుంచి భజన మండలి సభ్యులు వెళ్లారు. మంగళవారం రాత్రి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేంకటేశ్వర స్వామి సన్నిధిలో భజన చేసే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భజన మండలి సభ్యులు విశ్వనాథం, దాసరి అల్లూరి, దాసరి సాయిలు, కమ్మరి బ్రహ్మచారి, పుట్ట దత్తు, కుమ్మరి నారాయణ, ఊశయ్య తదితరులు పాల్గొన్నారు.