Temperatures | నిప్పుల కొలిమిలా భానుడు.. ఆరెంజ్​ జోన్​లోకి పలు ప్రాంతాలు

నిప్పుల కొలిమిలా భానుడు.. ఆరెంజ్​ జోన్​లోకి పలు ప్రాంతాలు
నిప్పుల కొలిమిలా భానుడు.. ఆరెంజ్​ జోన్​లోకి పలు ప్రాంతాలు
Advertisement

అక్షరటుడే, హైదరాబాద్: Temperatures : తెలంగాణ రాష్ట్రంలో భానుడు నిప్పుల కొమిలా మారి తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఒక్కసారిగా భగభగలతో విరుచుపడ్డాడు. రాష్ట్రంలోని పలు చోట్ల బుధవారం గరిష్ట ఉష్ణోగ్రతలు (Temperature) 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో ఆరెంజ్​ అలెర్ట్ ప్రకటించింది.

పెరిగిన ఉష్టోగ్రతలతో జనాలు అల్లాడుతున్నారు. ఏసీ(AC) లు, కూలర్ల(Coolers) వినియోగం పెరగడంతో విద్యుత్​ డిమాండ్​ కూడా పెరిగింది. చల్లదనం ఉపశమనం పొందేందుకు ప్రజలు కూల్​ డ్రింక్స్, బోండాలు విపరీతంగా తాగేస్తున్నారు. మరో 3 రోజుల్లో 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.

ఇది కూడా చ‌ద‌వండి :  Govt Employee | వ్యవసాయ శాఖ ఉద్యోగి మృతి

నిర్మల్​ జిల్లా కడ్డం పెద్దూర్​లో అత్యధికంగా 40.7 డిగ్రీల ఉష్టోగ్రత నమోదైంది. ఆదిలాబాద్​ జిల్లా బేలలో 40.6, నిజామాబాద్(Nizamabad)​ జిల్లా మంచిప్ప(మోపాల్​)లో 40.4 డిగ్రీలు నమోదయ్యాయి.

ఒకవైపు కనిష్ట ఉష్టోగ్రత మొన్నటి వరకు 12 డిగ్రీలోపు ఉండగా.. ఒక్కసారిగా 20 డిగ్రీలకు చేరుకున్నాయి. వాతావరణంలో ఒక్కసారిగా ఏర్పడిన మార్పుతో ఒకింత ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. కొందరిలో స్కిన్​ ఎలర్జీని గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. ముఖ్యంగా స్కిన్​ పగులు బారిన పడటం గుర్తించినట్లు చెప్పారు.

నిప్పుల కొలిమిలా భానుడు.. ఆరెంజ్​ జోన్​లోకి పలు ప్రాంతాలు
నిప్పుల కొలిమిలా భానుడు.. ఆరెంజ్​ జోన్​లోకి పలు ప్రాంతాలు
Advertisement