అక్షరటుడే, హైదరాబాద్: Temperature : తెలంగాణ రాష్ట్రంలో భానుడి ప్రతాపం కొనసాగుతోంది. ఆదివారం రికార్డు స్థాయిలో 42 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ఎండ ప్రభావం కనబడుతోంది. మధ్యాహ్నం మరింత తీవ్రంగా ఉంటోంది. బలమైన వడ గాలులు సైతం దడ పుట్టిస్తున్నాయి. సోమవారం కూడా వీటి ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
Temperature : అత్యధికంగా..
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాలానగర్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా 42.6 డిగ్రీలు నమోదయ్యాయి. నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, నల్గొండ, వనపర్తి, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్ తదితర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి.