అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : బీఎస్‌ఎన్‌ఎల్‌ (భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌) తన వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఫైబర్‌ నెట్‌ యూజర్ల కోసం ఐఎఫ్‌టీవీ(IFTV) పేరిట కొత్త సర్వీస్‌ను ప్రారంభించింది. ఇందులో ఉన్న 500కిపైగా లైవ్‌ టీవీ ఛానళ్లను డేటాతో సంబంధం లేకుండా.., హైస్ట్రీమింగ్‌ క్వాలిటీతో వీక్షించవచ్చని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎక్స్‌ వేదికగా తన పోస్టులో తెలిపింది. ప్రస్తుతానికి ఐఎఫ్‌టీవీ సర్వీసులు ఆండ్రాయిడ్‌ టీవీల్లో మాత్రమే లభిస్తాయని, అండ్రాయిడ్‌ ఆపై వెర్షన్లు వాడుతున్నవారు బీఎస్‌ఎన్‌ఎల్‌ లైవ్‌ టీవీ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకొని చూడవచ్చని పేర్కొంది.