అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో దోమకొండ తహశీల్దార్ సంజయ్ రావుకు వినతిపత్రం అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబెట్టి రోజులు గడుస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. అకాల వర్షానికి ధాన్యం తడిసి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు కల్పించడం లేదని వివరించారు. అధికారులు స్పందించి ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని కోరారు. కార్యక్రమంలో భారతీయ కిసాన్ దోమకొండ సభ్యులు పాల్గొన్నారు.