అక్షరటుడే, భిక్కనూరు : భారతీయ కిసాన్ సంఘ్ తిప్పాపూర్ కార్యవర్గం శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా తాటిపల్లి సిద్ధరాములు, ఉపాధ్యక్షుడిగా గంపల కమలాకర్, కార్యదర్శిగా కొండ సాయిలు, కోశాధికారిగా కస్తూరి మహేశ్, ముఖ్య సలహాదారుగా బస్వారెడ్డి, కార్యవర్గ సభ్యులుగా తిరుపతి, భూపాల్ రెడ్డి, బాలా గౌడ్, మల్లు పేట భూమయ్య, కోటిగళ్ల రవి, స్వామి, మల్లయ్య, ధర్మారెడ్డి ఎన్నికయ్యారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సింగిరెడ్డి రాజేశం, కామారెడ్డి మండలాధ్యక్షుడు కొమిరిశెట్టి అంజన్న తదితరులు పాల్గొన్నారు.