Deputy CM | అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం కానున్న భట్టి

Deputy CM | అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం కానున్న భట్టి
Deputy CM | అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం కానున్న భట్టి
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Deputy CM | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రజాభవన్​లో ఈ మీటింగ్​ జరగనుంది. కేంద్రంలో పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది.

సీఎం రేవంత్​రెడ్డి ఇటీవల ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసి వచ్చారు. రీజినల్​ రింగ్​ రోడ్డు, మెట్రో రెండో దశ, ఫ్యూచర్​ సిటీ నిర్మాణం తదితర పనులకు నిధులు కావాలని కోరారు. అనంతరం ఢిల్లీ నుంచి వచ్చిన సీఎం రాష్ట్రంలో అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి నిధులు తీసుకురావడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో రేపు అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించనుండడంపై ఆసక్తి నెలకొంది.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Contactors | డిప్యూటీ సీఎం ఛాంబర్ ఎదుట కాంట్రాక్టర్ల ఆందోళన