అక్షరటుడే, కామారెడ్డి: కామారెడ్డి డీపీఆర్వోగా ఎన్.భీం కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సిద్దిపేట డీపీఆర్వో రవికుమార్ ఇంతవరకు ఇక్కడ బాధ్యతలు ఇన్ చార్జి బాధ్యతలు నిర్వర్తించేవారు. హైదరాబాద్ ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే భీం కుమార్ బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.