అక్షరటుడే, ఇందూరు:Bhu Bharathi Nizamabad | భూ వివాదాల శాశ్వత పరిష్కారానికే ‘భూభారతి’(Bhu bharathi) చట్టంను ప్రభుత్వం తీసుకొచ్చిందని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు(Collector rajiv gandhi hanumanthu) పేర్కొన్నారు. కమ్మర్పల్లి, మోర్తాడ్, ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్లో గురువారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..వివాదాలకు తావులేకుండా రైతులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు.
Bhu Bharathi Nizamabad | ఆధార్ తరహాలో భూదార్ కార్డు
మే మొదటి వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాల్లో భూభారతి చట్టాన్ని అమలు చేస్తారని పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులే గ్రామాలకు వచ్చి అర్జీలు స్వీకరిస్తారని, నిర్ణీత కాల వ్యవధిలో వాటిని పరిష్కరిస్తారని వివరించారు. ఈ చట్టం ప్రవేశపెట్టిన ఏడాదిలోపు భూ సంబంధిత సమస్యలపై అర్జీలు పెట్టుకునే అవకాశం కల్పించారని వివరించారు. భూమి కలిగిన ప్రతి రైతుకు ఆధార్ కార్డు తరహాలో భూదార్ కార్డు(Bhudar card) ఇస్తామన్నారు.
భూ సమస్యల పరిష్కారం కోసం అప్పీలు వ్యవస్థ ఉందని కలెక్టర్(Collector) ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రస్తుతం తహశీల్దార్, ఆర్డీవో, కలెక్టర్, సీసీఎల్ఏ స్థాయిల్లో అప్పీల్ వ్యవస్థ ఉందని వివరించారు. ప్రతి ఏడాది డిసెంబర్ 31న భూభారతి చట్టంలోని నిబంధనల ప్రకారం రికార్డులను అప్డేట్ చేస్తామన్నారు.
Bhu Bharathi Nizamabad | మధ్యవర్తులను ఆశ్రయించవద్దు
భూ సమస్యల పరిష్కారం కోసం మధ్యవర్తులను ఆశ్రయించవద్దని కలెక్టర్ పేర్కొన్నారు. అసైన్మెంట్ భూములకు(Assignment lands) సంబంధించి కూడా త్వరలోనే ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేయనుందని వివరించారు.