అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bhu Bharati | రైతుల సమస్యలు పరిష్కరించేలా భూ భారతి bhu bhaarathi పోర్టల్ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు. జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి భూ భారతిపై new revenue portal in Telangana ఉన్నతాధికారులతో ఆదివారం సమీక్ష నిర్వహించారు.
సామాన్య రైతులకు సులభంగా అర్థమయ్యేలా, అత్యాధునికంగా, 100 ఏళ్ల పాటు నడిచే భూ భారతి వెబ్‌సైట్‌ను రూపొందించాలని ఆదేశించారు. భూ భారతి పోర్టల్ భద్రత కోసం ఫైర్‌వాల్స్ ఏర్పాటు చేసి, నిర్వహణను విశ్వసనీయ సంస్థకు అప్పగించాలని సూచించారు.
భూ భారతి వెబ్‌సైట్ సరళంగా, పారదర్శకంగా ఉండాలని, భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా దాన్ని రూపొందించాలన్నారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.