అక్షరటుడే, జుక్కల్: వినాయక మండపాల వద్ద డీజేలకు అనుమతి లేదని బిచ్కుంద సర్కిల్ ఇన్ స్పెక్టర్ జగడం నరేశ్ తెలిపారు. గురువారం బిచ్కుందలోని సర్కిల్ కార్యాలయంలో డీజే నిర్వాహకులతో మాట్లాడారు. వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. వినాయక చవితి మండపాల ఏర్పాటుకు అనుమతులు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో నడుచుకోవాలని సూచించారు. అనంతరం డీజే నిర్వాహకులను తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. ఆయన వెంట ఎస్సై మోహన్ రెడ్డి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.