Bichkunda | మున్సిపాలిటీగా బిచ్కుంద.. అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి

Bichkunda | మున్సిపాలిటీగా బిచ్కుంద.. అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి
Bichkunda | మున్సిపాలిటీగా బిచ్కుంద.. అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి

అక్షరటుడే, నిజాంసాగర్​: Bichkunda | బిచ్కుందను మున్సిపాలిటీగా bichkunda muncipality ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్​బాబు సోమవారం అసెంబ్లీలో ప్రకటించారు.

Advertisement
Advertisement

రాష్ట్రంలో మొత్తం ఆరు మున్సిపాలిటీలను కొత్తగా ఏర్పాటు చేశారు. అందులో జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద కూడా ఉందని ఆయన ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హర్షం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఇన్ని రోజులు రాష్ట్రంలో మున్సిపాలిటీ లేని ఏకైక నియోజకవర్గం జుక్కల్  మాత్రమేనన్నారు. బిచ్కుందను మున్సిపాలిటీగా చేయాలని నిర్ణయించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

Bichkunda | ఏళ్లనాటి కల

జుక్కల్​ నియోజకవర్గం గ్రామీణ, వెనుకబడిన ప్రాంతం. నియోజకవర్గంలోని బిచ్కుందను మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్​ చేస్తున్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సీఎం రేవంత్​రెడ్డి, మంత్రుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఈ క్రమంలో ప్రభుత్వం బిచ్కుందను మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Mla Lakshmikantha Rao | సన్నబియ్యం పంపిణీని పకడ్బందీగా నిర్వహించాలి

Bichkunda | ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి

నిజాంసాగర్​లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్​తో పాటు ఫిషరీస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కోరారు. అసెంబ్లీలో సోమవారం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తూ ముందుకు వెళ్తుందన్నారు.

Advertisement