Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Big Boss | ఎనిమిది సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 త్వరలో మొదలు కాబోతుంది. అసలైతే బిగ్ బాస్ తెలుగు ప్రతి సీజన్ ఆగష్టు, సెప్టెంబరులో అలా మొదలవుతుంది. కానీ ఈసారి ముందు అంతకన్నా ముందే మొదలు పెట్టేలా ఉన్నారని టాక్. అంతేకాదు ఈసారి హోస్ట్ కూడా మారబోతున్నాడని తెలుస్తుంది. బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ ని ఎన్టీఆర్ హోస్ట్ గా చేశాడు. రెండో సీజన్ నాని ఆ బాధ్యత తీసుకున్నాడు.

ఇక 3వ సీజన్ నుంచి 8వ సీజన్ వరకు నాగార్జుననే హోస్ట్ గా చేశాడు. అంతేకాదు ఒక నాన్ స్టాప్ ఎపిసోడ్ ని కూడా చేశాడు నాగార్జున. ఐతే సీజన్ 9 కూడా నాగార్జున హోస్ట్ గా చేస్తాడని టాక్ ఉండగా ఇప్పుడు ఆయన ప్లేస్ లో కొత్త హోస్ట్ రాబోతున్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ తెలుగు అంటే హోస్ట్ గా కింగ్ నాగార్జున ఫిక్స్ అనిపించేలా చేశాడు. నాగార్జున హోస్టింగ్ కి తెలుగు బిగ్ బాస్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Bigg Boss 9 : ఈసారి త్వరగానే బిగ్ బాస్ 9.. ఆ పనులు మొదలు పెట్టిన టీమ్..!

Big Boss | బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్ గా రౌడీ స్టార్..

ఐతే ఈసారి హోస్ట్ కూడా మారే ఛాన్సులు బాగా ఉన్నాయని తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్ గా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండని తీసుకుంటారని తెలుస్తుంది. సీజన్ 9 హోస్ట్ గా విజయ్ దేవరకొండని భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ తీసుకుంటున్నారని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9 నాగార్జున హోస్ట్ గా చేసే ఛాన్స్ లు లేవనంట్టు తెలుస్తుండగా ఆ ఛాన్స్ ని విజయ్ దేవరకొండ గ్రాబ్ చేస్తున్నాడని తెలుస్తుంది.

విజయ్ దేవరకొండ వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం అతని కింగ్ డం మే చివర్లో రాబోతుంది. ఆ సినిమాతో పాటు కిరణ్ కోలా డైరెక్షన్ లో ఒక సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది. శ్యామ్ సింగ రాయ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ తో కూడా విజయ్ దేవరకొండ ఒక పీరియాడికల్ మూవీ ఉండబోతుందని తెలుస్తుంది.

Advertisement