అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bumrah | ఇటీవలి కాలంలో ఐపీఎల్‌కి IPL ఎంత క్రేజ్ ఏర్పడుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ ఆటగాళ్లు కూడా ఐపీఎల్‌లో IPL పాల్గొంటూ అదరగొడుతున్నారు. అయితే సాధారణంగా మ్యాచ్ జరిగే సమయంలో కొందరు ఆటగాళ్లు కాస్త ఫ్రస్ట్రేట్ little frustrate అవుతుండడం మనం చూస్తూనే ఉంటాం.
ఇటీవల హెడ్, మ్యాక్స్‌వెల్ మధ్య కూడా చిన్నపాటి గొడవ జరిగింది. ఇక తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ Delhi Capitals వర్సెస్ ముంబై ఇండియన్స్ mumbai indians మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా Jasprit Bumrah.. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ కరుణ్ నాయర్ Karun Nair గొడవపడ్డారు. ఒకరిపై ఒకరు నోరు పారేసుకోగా, ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Bumrah | ఏం జరిగింది అంటే..
ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా impact player బరిలోకి దిగిన కరుణ్ నాయర్ Karun Nair పాత ఫామ్ పుణికిపుచ్చుకొని బ్యాట్ ఝుళిపించాడు. ముంబై బౌలర్స్‌ని చితక్కొట్టి డీసీని విజయతీరాలకి చేర్చాడు. కాని చివరిలో రనౌట్స్ ఆ టీమ్ ఓటమి పాలయ్యేలా చేసింది. వరల్డ్ బెస్ట్ పేసర్ అయిన జస్‌ప్రీత్ బుమ్రా Jasprit Bumrah బౌలింగ్‌లోనూ అలవోకగా సిక్సర్లు బాదాడు. బుమ్రా వేసిన 4వ ఓవర్‌లో రెండు బౌండరీలతో 11 పరుగులు పిండుకున్న కరుణ్ నాయర్.. అతను వేసిన 6వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 18 పరుగులు పిండుకొని 22 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఏడేళ్ల తర్వాత ఐపీఎల్‌లో అర్థ శతకం half-century నమోదు చేశాడు.
అయితే రన్ తీసే క్రమంలో కరుణ్ నాయర్ Karun nair.. చూసుకోకుండా బుమ్రాను ఢీకొట్టాడు. వెంటనే అతనికి క్షమాపణలు apologized కూడా చెప్పాడు. కానీ బౌండరీలు బాదాడనే ఫ్రస్టేషన్‌తో కరుణ్ నాయర్‌పై బుమ్రా నోరు జారాడు. ఈ ఎక్స్‌ట్రాలే వద్దు అన్నట్టుగా బుమ్రా వార్నింగ్ Bumrah gave warning ఇచ్చినట్టు అర్ధమవుతుంది. అయితే కరణ్ కూడా ఆగ్రహానికి గురయ్యాడు. అప్పుడు అంపైర్ జోక్యం చేసుకొని బుమ్రాకు సర్ది చెప్పాడు. కరుణ్ నాయర్ తన తప్పులేదని హార్దిక్ పాండ్యాకు Hardik Pandya వివరణ ఇచ్చాడు. మరోవైపు ఈ గొడవ జరుగుతుండగా.. రోహిత్ శర్మ Rohit Sharma ఫన్నీ రియాక్షన్‌తో నవ్వులు laugh పూయించాడు. రోహిత్ Rohit Sharma రియాక్షన్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ స్కోర్‌ని ఢిల్లీ చేజ్ చేయలేక చతికిల పడింది.
ROHIT SHARMA’s REACTION 😀🔥 pic.twitter.com/ZyPzY8KLNB
— Johns. (@CricCrazyJohns) April 13, 2025