అక్షరటుడే, ఇందూరు :Bigala Birthday | అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా(Urban former MLA bigala ganesh gupta) జన్మదిన వేడుకలను గురువారం బీఆర్ఎస్ నాయకులు(Brs leaders) నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని పార్టీ కార్యాలయంలో నగరాధ్యక్షుడు సిర్పరాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. అనంతరం రైల్వేస్టేషన్, స్నేహా సొసైటీలో మాజీ మేయర్ నీతూకిరణ్(Former mayor neetu kiran) ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.
బస్టాండ్ ఆవరణలో మాజీ జడ్పీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు ఆధ్వర్యంలో, నెహ్రూ పార్కులో మతిన్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో.. గాండ్ల లింగం, నర్సింగ్‌రావు, సూధం రవిచందర్ ఆధ్వర్యంలో జిల్లా ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పార్టీ ఎస్సీ సెల్ ప్రతినిధి నీలగిరి రాజు ఆధ్వర్యంలో బాలసదన్‌లో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు బహూకరించారు. చింతకాయల రాజు ఆధ్వర్యంలో బాలసదన్‌లో అన్నదానం చేశారు. కార్యక్రమాల్లో నుడా మాజీ ఛైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి, నాయకులు దండు శేఖర్, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్య ప్రకాష్, దాత్రిక పరమేష్, కరిపె రాజు తదితరులు పాల్గొన్నారు.