Bigg Boss 9 : ఈసారి త్వరగానే బిగ్ బాస్ 9.. ఆ పనులు మొదలు పెట్టిన టీమ్..!

Bigg Boss 9 : ఈసారి త్వరగానే బిగ్ బాస్ 9.. ఆ పనులు మొదలు పెట్టిన టీమ్..!
Bigg Boss 9 : ఈసారి త్వరగానే బిగ్ బాస్ 9.. ఆ పనులు మొదలు పెట్టిన టీమ్..!
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Bigg Boss 9 : సక్సెస్ ఫుల్ గా 8 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు త్వరలో సీజన్ 9 కి సిద్ధం కాబోతుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈసారి అనుకున్న టైం కన్నా ముందే స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ టీం హౌస్ సెటప్ ని సిద్ధం చేసే పనిలో ఉన్నారట. అంతేకాదు ఈసారి కంటెస్టెంట్స్ విషయంలో కూడా చాలా క్లియర్ గా ఉండాలని చూస్తున్నారు. సీజన్ 8 లో ఓల్డ్ కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డ్ గా తీసుకొచ్చారు. ఈసారి అలాంటి పనులు ఏవి చేయట్లేదని తెలుస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 9 ని మునుపటి సీజన్ల కన్నా కొత్తగా నెవర్ బిఫోర్ అనిపించేలా చేయాలని చూస్తున్నారు. ఇక రాబోయే సీజన్ హోస్ట్ గా నాగార్జున బదులు విజయ్ దేవరకొండ చేస్తారన్న టాక్ ఉంది. ఐతే దీనికి సంబందించి అఫీషియల్ అప్డేట్ మాత్రం రాలేదు. బిగ్ బాస్ ప్రతి సీజన్ ఆగష్టు లేదా సెప్టెంబర్ లో మొదలవుతుంది. ఐతే ఈసారి మాత్రం త్వరగానే అంటే జూన్, జూలైలోనే మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారట.

ఇది కూడా చ‌ద‌వండి :  Vijay Deverakonda : విజయ్ దేవరకొండ డిమాండ్ కి బిగ్ బాస్ టీం షాక్.. ఎన్ని కోట్లు అడిగాడంటే..?

Bigg Boss 9 : ఈ సీజన్ ని చాలా ప్రెస్టీజియస్ గా..

బిగ్ బాస్ టీం ఈ సీజన్ ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుందని తెలుస్తుంది. ముఖ్యంగా బిగ్ బాస్ నుంచి వస్తున్న లీక్స్ షో మీద ఫోకస్ తగ్గేలా చేస్తుందని తెలుసుకున్న టీం ఇక మీదట అలాంటి లీక్స్ రాకుండా జాగ్రత్త వహిస్తున్నారని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9 కూడా అటు జియో హాట్ స్టార్ లో 24/7 లైవ్ అందిస్తారు.

ఐతే ప్రతిసారి ప్రతి సీజన్ లో ఒక కెమెరాలో ఉన్న ఫీడ్ నే లైవ్ లో అందిస్తారు. షోలో చూపించే కంటెంట్ ని దాచేస్తారు. కానీ ఈసారి లైవ్ లో కూడా ఆ కంటెంట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట బిగ్ బాస్ టీం. ఎందుకంటే కొంతమంది కంటెస్టెంట్స్ మీద పార్షియాలిటీ చూపిస్తున్నారు అన్న కారణంతో అలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.

Advertisement