అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bike Theft | జిల్లాలోని పలు ప్రాంతాల్లో బైక్ చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు రూరల్సీఐ శ్రీనివాస్(Rural CI Srinivas) పేర్కొన్నారు. బుధవారం వివరాలు వెల్లడించారు.
నగరంలోని కసాబ్గల్లీ(Kasabgalli)కి చెందిన షేక్ అహ్మద్(Sheikh Ahmed) అనే వ్యక్తి గాజులు అమ్ముతూ జీవించేవాడని.. అయితే ఈ వ్యాపారంతో కుటుంబ అవసరాలు తీరకపోవడంతో బైక్చోరీలకు పాల్పడ్డాడు. ఇరవైరోజుల క్రితం ఖిల్లా రామాలయం(Killa Ramalayam) సమీపంలో, వర్నిలోని జలాల్పూర్లో, డిచ్పల్లిలో మూడు బైక్లను చోరీ చేశాడు. ఈనెల 25న నాగారంలో బ్రాహ్మణ కాలనీలో ఆటో చోరీ చేసేందుకు యత్నించాడు. దీంతో ఆటో యజమాని ఫిర్యాదు చేయగా బుధవారం నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు చేధనలో చురుకుగా వ్యవహించిన 5వ టౌన్ ఎస్సై గంగాధర్(5th Town SI Gangadhar), సిబ్బందిని అభినందించామని సీఐ(CI) తెలిపారు.