అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: దేశ ప్రధాని నరేంద్ర మోదీ, మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జు మధ్య సోమవారం ఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ భేటీ అనంతరం ఇరువురు నేతలు సంయుక్త ప్రకటన చేశారు. మాల్దీవులతో భారత్‌ది చిరకాల స్నేహం అని మోదీ పేర్కొన్నారు. మాల్దీవులకు కష్టమొస్తే ఆదుకునే విషయంలో ముందుండేది భారత్‌ అని పేర్కొన్నారు. కోవిడ్‌ వ్యాక్సిన్ల సరఫరా, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సాయం చేసిన విషయాన్ని మోదీ గుర్తుచేశారు.