Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్: ఆంధ్రప్రదేశ్​లోని ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్​ ఫ్లూ కలకలం రేపుతోంది. నెల రోజులుగా లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో అధికారులు చనిపోయిన కోళ్ల నమునాలను పరీక్షల కోసం ల్యాబ్​కు పంపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూర్​, తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కానూర్​లోని కోళ్ల ఫారాల నుంచి పంపిన శాంపిల్స్​ పరీక్షించి బర్డ్​ ఫ్లూగా నిర్ధారించారు. దీంతో ఆయా జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టరేట్​లో కంట్రోల్​ రూమ్​ ఏర్పాటు చేశారు. చికెన్‌ అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా కొన్ని రోజులుగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.

Advertisement