అక్షరటుడే, వెబెడెస్క్ : Bird Flu | రాష్ట్రంలో మరోసారి బర్డ్ ఫ్లూ(Bird Flu) కలకలం సృష్టిస్తోంది. గతంలో చాలా ప్రాంతాల్లో కోళ్లు(Chickens) చనిపోవడంతో ప్రజలు చికెన్ తినడానికే భయపడ్డారు. ఇటీవల బర్డ్ ఫ్లూ భయం పోయినట్లే అనిపించినా తాజాగా మళ్లీ కేసులు నమోదు అవుతుండటంతో ఆందోళన నెలకొంది.
నల్గొండ(Nalgonda) జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలోని కోళ్లఫారంలోని కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిందని అధికారులు నిర్ధారించారు. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామంలోని ఓ కోళ్ల ఫారంలో 500 కోళ్లు బర్డ్ ఫ్లూ సోకి మృతి చెందాయి. దీంతో ఫారంలోని 52 వేల కోళ్లు, 17 వేల గుడ్లు, 85 టన్నుల దానాను పూడ్చిపెటినట్టు అధికారులు తెలిపారు. ఇటీవల మెదక్ జిల్లాలోని పలు కోళ్లఫారాల్లో సైతం భారీగా కోళ్లు చనిపోయాయి.
Bird Flu | పౌల్ట్రీ రైతుల ఆందోళన
బర్డ్ ఫ్లూ వైరస్‌తో పౌల్ట్రీ రైతులు(Farmers), చికెన్ సెంటర్ల(Chicken Centers) నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. వేలకొద్ది కోళ్లు చనిపోవడంతో ఆయా ఫారాల రైతులు నష్టపోతున్నారు. అయితే వైరస్ భయంతో చికెన్ కొనుగోళ్లు తగ్గిపోవడంతో మిగతా ప్రాంతాల్లోని కోళ్ల ఫారాల యజమానులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు చికెన్ సెంటర్ల నిర్వాహకులు కూడా గిరాకీ ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.