అక్షరటుడే, హైదరాబాద్: Bird flu | రాష్ట్రంలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. రంగారెడ్డి జిల్లా Rangareddy district బాట సింగారంలోని పౌల్ట్రీ ఫామ్ లో బర్డ్ ఫ్లూ Bird flu విజృంభిస్తున్నట్లు సమాచారం. ఫలితంగా ఇప్పటికే వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. ఆ కోళ్లను అధికారులు పరిశీలించారు.
భోపాల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ National Institute of High Security యానిమల్ డిసీజెస్(ఎన్ఐహెచ్ఎస్ఏడీ)కు శాంపిల్స్ ని అధికారులు పంపించారు. ఆ కోళ్లకు హెచ్5ఎన్1 వైరస్ సోకిందని సైంటిస్టులు నిర్ధారించారు. దీంతో అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు.
సదరు పౌల్ట్రీ ఫామ్ లోని సుమారు 10 వేల కోళ్లను అధికారులు పొక్లైన్ సాయంతో పూడ్చిపెట్టారు. ఆ ఫామ్ ను కూడా సీజ్ చేశారు.
దీంతోపాటు అబ్దుల్లాపూర్ మెట్ Abdullapurmet ప్రాంతంలో కోళ్లు, గుడ్లు అమ్మకుండా కూడా నిషేధించారు. సుమారు10 కిలోమీటర్ల పరిధిలోని పౌల్ట్రీ ఫారాలను అధికారులు సందర్శించారు. బర్డ్ ఫ్లూ నివారణ చర్యలు చేపట్టారు.