Bird flu virus | బర్డ్ ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి

Bird flu virus | రెండేళ్ల చిన్నారిని మింగిన బర్డ్ ఫ్లూ వైరస్​
Bird flu virus | రెండేళ్ల చిన్నారిని మింగిన బర్డ్ ఫ్లూ వైరస్​

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bird flu virus : ఆంధ్ర ప్రదేశ్​లోని పల్నాడు జిల్లా నరసరావు పేటలో బర్డ్ ఫ్లూ(హెచ్ఎస్ఎన్)తో రెండేళ్ల చిన్నారి మృతిచెందింది. మాంసం తినే అలవాటుతో పాటు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం చిన్నారి మరణానికి కారణమని వైద్యులు నిర్ధారించారు. బర్డ్ ఫ్లూ వైరస్​ వల్లే చిన్నారి మరణించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(Indian Council of Medical Research) కూడా నిర్ధారించింది.

Advertisement
Advertisement

మార్చి 16న చిన్నారి చనిపోగా.. వివిధ స్థాయిల్లో నమూనాలను పరీక్షించి అధికారికంగా ప్రకటించారు. బర్డ్ ఫ్లూ వల్ల మనుషుల మరణం సంభవించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Ponno Fish Nutritional : ఇది చేప కాదండోయ్ పోష‌కాల పుట్ట‌.. ఒక్క ముక్క 300 రోగాల‌కి చెక్క్..?