Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్(Donald Trump) ​ఎఫెక్ట్​తో బిట్​కాయిన్(Bit coins) ​విలువ తగ్గుతూనే ఉంది. మంగళవారం 90 వేల డాలర్ల దిగువకు బిట్​కాయిన్​ పడిపోయింది. మార్చి 4 నుంచి మెక్సికో, కెనడాపై సుంకాలను విధిస్తామని ట్రంప్​ ప్రకటించిన నేపథ్యంలో బిట్​కాయిన్​ క్షీణిస్తోంది. దీంతో ప్రపంచ వాణిజ్యంపై సుంకాల ఎఫెక్ట్​ ఎలా ఉంటుందోనని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో బిట్ కాయిన్​తో పాటు ప్రపంచ మార్కెట్లు కొద్దిరోజులుగా ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో క్రిప్టో మార్కెట్ సుమారు 8 శాతం పడిపోయింది.

ఇతర క్రిప్టోల పరిస్థితి

బిట్​కాయిన్​తో పాటు ఈథర్, సోలానా, డోగ్‌కోయిన్‌తో సహా అనేక ప్రముఖ ఆల్ట్‌కాయిన్‌లు కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటూనే ఉన్నాయి. రెండో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన ఈథర్ రెండు రోజుల్లో 10 శాతానికి పైగా క్షీణించింది. సోలానా 15 శాతం, డోగోకాయిన్​ 13 శాతం పడిపోయాయి.

పెరుగుతున్న బంగారం

మిగతా మార్కెట్లతో పోలిస్తే క్రిప్టో కరెన్సీ ప్రస్తుతం బలహీనంగా ఉంది. గ్లోబల్​ మార్కెట్లలో కూడా అనిశ్చితి నెలకొన్నా.. క్రిప్టో కరెన్సీ వేగంగా పడిపోవడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ట్రంప్​ దెబ్బతో పసిడి ధర పరుగులు పెడుతోంది. మార్కెట్ల పతనంతో మదుపర్లు బంగారంపై తమ దృష్టి కేంద్రీకరించారు.

అమ్మకాల ఒత్తిడి

క్రిప్టో ఎక్స్​చేంజ్​ బైబిట్ గత వారం హ్యాకర్లు కోల్పోయిన అంచనా 1.4 బిలియన్​ డాలర్లను పునరుద్ధరిస్తామని ప్రతిజ్ఞ చేసిన ఈథర్ ఒత్తిడిని ఎదుర్కొంటూనే ఉంది. మరోవైపు క్రిప్టో సంబంధిత కంపెనీల షేర్లు కూడా పడిపోతున్నాయి. కాయిన్‌బేస్ గ్లోబల్ ఇంక్ ఆరు రోజులుగా తిరొగమనంలోనే ఉంది. మైక్రోస్ట్రాటజీ సుమారు 5.7శాతం పడిపోయింది. బిట్​కాయిన్​ మైనర్ మారా హోల్డింగ్స్ సోమవారం 5.3 శాతం, గతం వారంలో 13శాతం క్షీణించింది.

Advertisement