Tamil Nadu | బీజేపీ, ఏఐడీఎంకే పొత్తు ఖరారు.. ఎన్నికలకు కలిసి వెళ్లాలని నిర్ణయం

Tamil Nadu | బీజేపీ, ఏఐడీఎంకే పొత్తు ఖరారు.. ఎన్నికలకు కలిసి వెళ్లాలని నిర్ణయం
Tamil Nadu | బీజేపీ, ఏఐడీఎంకే పొత్తు ఖరారు.. ఎన్నికలకు కలిసి వెళ్లాలని నిర్ణయం

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Tamil Nadu | తమిళనాడులో బీజేపీ, అన్నా డీఎంకే BJP and AIADMK మధ్య పొత్తు ఖరారైంది. ఈ మేరకు రెండు పార్టీలు అధికారికంగా ప్రకటించాయి. ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా Union Home Minister Amit Shah, అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి AIADMK Palaniswami మాట్లాడారు. తమిళనాడులో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయని అమిత్ షా Amit Shah చెప్పారు.

Advertisement

ఈ ఎన్నికల్లో ఎన్డీయేకు NDA పళనిస్వామి నాయకత్వం Palaniswami lead వహిస్తారని తెలిపారు. పొత్తు కుదుర్చుకోవడంపై ఎలాంటి షరతులు పెట్టుకోలేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 1998 నుంచి అన్నాడీఎంకే ఎన్డీయేలో భాగంగా ఉందని గుర్తు చేశారు. ప్రధాని మోదీ, మాజీ ముఖ్యమంత్రి జయలలిత గతంలో కలిసి పని చేశారని తెలిపారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Waqf Board | ఆ గ్రామం మాదే.. వెంటనే ఖాళీ చేయండి: వక్ఫ్​ బోర్డు నోటీసులు

Tamil Nadu | వ్యతిరేక ఓటు చీలిపోవద్దని..

రాష్ట్రంలో డీఎంకేపై DMK వ్యతిరేకత వెల్లువెత్తుతున్న తరుణంలో రెండు పార్టీలు జట్టు కట్టడం సరైన నిర్ణయమని నేతలు పేర్కొన్నారు. డీఎంకేను అధికారంనుంచి దించాలన్నా, వ్యతిరేక ఓటు చీలిపోకూడదన్నా కలిసి పని చేయాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా తమిళనాడులో Tamil Nadu మాత్రమే ఐదు పక్షాల మధ్య పోటీ ఉంది. దీంతో ఓటు చీలిపోయే ప్రమాదముండడంతో బీజేపీ, అన్నాడీఎంకే BJP and AIADMK పొత్తు వైపు మళ్లాయి.

Advertisement