అక్షరటుడే, వెబ్డెస్క్: MLC Results : కరీంనగర్–ఆదిలాబాద్– నిజామాబాద్– మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. మూడు రోజులుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సాగుతున్న విషయం తెలిసిందే. రెండో ప్రాధాన్యత ఓట్లతో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. కాసేపట్లో అధికారికంగా ఆయన విజయంపై ప్రకటన వెలువడనుంది. దీంతో కౌంటింగ్ హాల్ నుంచి నరేందర్‌రెడ్డి వెళ్లిపోయారు. ఇప్పటికే కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా.. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది.
MLC Results : పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం
Advertisement
Advertisement