అక్షరటుడే, ఆర్మూర్ : అటు కేంద్రంలో ఇటు రాష్ట్రoలో ఆ రెండు పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. కానీ పటాకుల దందా పుణ్యమా అని ఆ రెండు పార్టీలకు చెందిన కొందరు నాయకులు కలిసి దుకాణాలను ఏర్పాటు చేశారు. ఆర్మూర్‌లో ప్రతి ఏటా పటాకుల దుకాణాలను పట్టణ శివారులోని సిద్దుల గుట్ట వెనుక భాగంలో ఏర్పాటు చేస్తారు. ఈ సారి సైతం దుకాణాలు ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్, బీజేపీ నాయకులు వేరు వేరుగా ప్రయత్నాలు చేశారు. చివరికి రెండు పార్టీల నాయకుల మధ్య సయోధ్య కుదరడంతో ఒకే చోట ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. మొత్తం 50 స్టాళ్లకు గాను ఇరు పార్టీలకు 25 చొప్పున పంపకాలు జరిగిగినట్లు సమాచారం. ఒక్కో స్టాలుకు రూ.12,500 ధరను సైతం నిర్ణయించారని తెలిసింది. ఇంత జరుగుతున్నా.. సంబంధిత శాఖల అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.