అక్షరటుడే, వెబ్‌డెస్క్: బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అక్టోబర్ 1న కామారెడ్డికి రానున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త బస్టాండ్‌లో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో, సుభాష్ రోడ్, తిలక్ రోడ్డులో సభ్యత నమోదులో పాల్గొంటారని ఆమె పేర్కొన్నారు. పట్టణంలోని రాజారెడ్డి గార్డెన్స్ లో మధ్యాహ్నం కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు హాజరై కేంద్ర మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.