అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో బీజేపీ ఫ్లోర్ లీడర్ జీవీ నర్సింహా రెడ్డి నేలపై భైఠాయించి నిరసన తెలిపారు. సాధారణ సర్వసభ్య సమావేశాన్ని బుధవారం నిర్వహించగా.. పట్టణంలో కుక్కల బెడదను నివారించాలని జీవీ నర్సింహా రెడ్డి డిమాండ్ చేశారు. మున్సిపల్ అధికారుల తీరుపై పోడియం ఎదుట భైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రజా పాలనా విజయోత్సవాల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. అలాగే ఆర్మూర్ మున్సిపల్ లో జరుగుతున్న అవినీతిపై కలెక్టర్ స్పందించాలని కోరారు.