అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: జనవరి నాటికి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొత్తవారిని ఎన్నుకునే అవకాశం ఉంది. దీంతో పాటు పలు రాష్ట్ర అధ్యక్షులను కూడా అధిష్టానం మార్చనుంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో జాతీయ అధ్యక్షుడితో పాటు కొన్ని రాష్ట్రాల అధ్యక్షుల పదవీ కాలాన్ని పొడిగించారు. ప్రస్తుతం కొత్తవారిని ఎంపిక చేయడానికి కసరత్తు ప్రారంభించారు. మూడు నెలల్లో బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. తర్వాత రాష్ట్ర, జాతీయ అధ్యక్షులను ఎన్నుకోనున్నారు.