అక్షరటుడే, వెబ్డెస్క్: CM Revanth Reddy | అహ్మదాబాద్ ఏఐసీసీ సమావేశంలో AICC meeting ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Chief Minister Revanth Reddy బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. బ్రిటీషోళ్ల లాగే దేశాన్ని బీజేపీ లూటీ చేస్తోందని విమర్శించారు. బ్రిటీష్ వాళ్లను తరిమికొట్టినట్లే ఆ పార్టీని ఓడగొట్టాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ Mahatma Gandhi విధానాలకు విరుద్ధంగా మోదీ పనిచేస్తున్నారని విమర్శించారు. గాడ్సే సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు. మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో బీజేపీ అడుగుపెట్టనివ్వబోమని వ్యాఖ్యానించారు.
CM Revanth Reddy | దేశమంతా కులగణన చేపట్టాలి
రాహుల్ గాంధీ Rahul Gandhi ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కులగణన నిర్వహించామని సీఎం రేవంత్ CM Revanth తెలిపారు. కేంద్ర ప్రభుత్వం central government దేశమంతా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేశామని చెప్పారు.