అక్షరటుడే, కామారెడ్డి టౌన్‌: బీజేపీ కామారెడ్డి పట్టణ కార్యవర్గాన్ని శనివారం నియమించారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. అధ్యక్షుడిగా ఆకుల భరత్‌, ఉపాధ్యక్షులుగా చిన్నోళ్ల రజినీకాంత్‌, నిట్టు గంగాధర్‌ రావు, సబ్బని ప్రవీణ్‌, గోడు విజయ్‌పాల్‌ రెడ్డి, నిట్టు రఘుపతి, మంద మనోజ్‌, జనరల్‌ సెక్రెటరీలుగా ప్రతాప్‌ నేత, శ్రీకాంత్‌, సెక్రెటరీలుగా నరేశ్‌గౌడ్‌, శ్రీనివాస్‌, గంగారాం, హేమలత, నరహరి, రంజిత్‌, కోశాధికారిగా గురుమూర్తిలను నియమించారు. అలాగే యువ మోర్చా, మహిళ, కిసాన్‌, దళిత్‌, మైనారిటీ, ఓబీసీ మోర్చాలను కూడా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.