Advertisement
అక్షరటుడే, భిక్కనూరు: భిక్కనూరుకు చెందిన బీజేపీ నాయకుడు మాలె నారాయణ దారుణ హత్యకు గురయ్యాడు. హత్నూర మండలం పల్పనూరు వద్ద ఆయనను దారుణంగా హతమార్చారు. ఆయన సంగారెడ్డి జిల్లాలోని నారాయణ పూర్ సమీపంలో గల ఓ పరిశ్రమలో పని చేస్తున్నాడు. గత నాలుగు రోజుల నుంచి ఆయన కనిపించడం లేదు. దీంతో మూడు రోజుల క్రితం మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సోమవారం నారాయణ మృతదేహం లభ్యమైంది.
Advertisement