అక్షరటుడే వెబ్‌డెస్క్‌ : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై బీజేపీ నేత తన్వీందర్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలు అభ్యంతకరమని కాంగ్రెస్ కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌ రావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన్వీందర్‌ను వెంటనే బీజేపీ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతల దిష్టిబొమ్మలను దహనం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ పిలుపునిచ్చారని తెలిపారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.