అక్షరటుడే, బాన్సువాడ: ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన అంశాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీగా ఉందని బీజేపీ నాయకులు మండిపడ్డారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. నిరుద్యోగ భృతి, రైతు కూలీలకు రూ.12 వేలు, 18 ఏళ్లు నిండిన యువతులకు స్కూటీలు, రైతు భరోసా కింద రైతులకు రూ.15 వేలు అందజేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. మలిదశ ఉద్యమకారులకు 250 గజాలు కేటాయిస్తామని ప్రకటించి విస్మరించిందన్నారు. కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మక్కన్న, అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి హన్మాండ్లు, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, కోనాల గంగారెడ్డి, బాలరాజ్, సాయి కిరణ్, భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Prajavani | ప్రజావాణిపై ప్రభుత్వం కీలక నిర్ణయం