అక్షరటుడే, ఇందూరు: దేశంపై ప్రతి పౌరుడికి భక్తి పెరగాలని, ఇది బాధ్యతగా భావించాలని బీజేపీ కంఠేశ్వర్ మండలాధ్యక్షుడు రోషన్ లాల్ బోరా, జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు అన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా శనివారం లాల్ బహుదూర్ శాస్త్రి విగ్రహాన్ని శుద్ధి చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పార్టీ పిలుపు మేరకు ఆగస్టు 15 వరకు రోజుకో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలను శుద్ధి చేశామన్నారు. ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సాయిరాం, శ్రీనివాస్, వేణు, రవి, ఆనంద్ రావు, సంజీవ్, ప్రవీణ్ పాల్గొన్నారు.