అక్షరటుడే, కామారెడ్డి టౌన్: ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతి చేసిన పార్టీ బీజేపీ అని గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కల్యాణ్ నాయక్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గిరిజన మోర్చా ఆధ్వర్యంలో బుధవారం సభ్యత్వ నమోదు నిర్వహించారు. కల్యాణ్ నాయక్ మాట్లాడుతూ.. గిరిజనుల హక్కుల సాధన బీజేపీతోనే సాధ్యమన్నారు. లంబాడా సోదరులు బీజేపీలో సభ్యత్వం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కుంట లక్ష్మారెడ్డి, విపుల్ జైన్, నరేందర్, రాజుపాటిల్, రజినీకాంత్ పాల్గొన్నారు.