అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సాయం అందించాలని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కోరారు. గురువారం అసెంబ్లీలోని బీజేపీ శాసనసభా పక్ష కార్యాలయంలో ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ విధివిధానాలు, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అనుసరించాల్సిన విషయాలపై చర్చించారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.