మున్నూరుకాపుల అభివృద్ధికి కృషి..

0

అక్షరటుడే, నిజామాబాద్‌ అర్బన్‌: మున్నూరుకాపుల అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. నగరంలోని శివాజీనగర్‌ మున్నూరుకాపు సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం ఆదివారం జరిగింది. అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణతో కలిసి అర్వింద్‌ పాల్గొన్నారు. తన పార్లమెంట్‌ నియోజకవర్గంలోని మున్నూరుకాపు సంఘాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశానన్నారు. భవిష్యత్తులోనూ అండగా ఉంటానని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా కృషి చేస్తోందన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పాల్గొని మున్నూరు కాపులకు అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.