అక్షరటుడే, ఇందూరు: పోలీసింగ్ విధానంలో బీఆర్‌ఎస్ సంస్కృతినే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో వలసపోయిన పక్షులు మళ్లీ జిల్లాకు వస్తున్నాయన్నారు. వారికి కేవలం ఎన్నికలే ముఖ్యమని.. బీజేపీకి మాత్రం ఎన్నికలతో పాటు ప్రజలు అత్యంత ముఖ్యమన్నారు. గతంతో పోల్చితే భారతీయ జనతా పార్టీ చాలా బలపడిందన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లిన కవిత మళ్లీ జిల్లాకు రావడం సిగ్గుచేటన్నారు. తమ ఎంపీపై దాడి జరిగితే పోలీసులు ఎటుపోయారని ప్రశ్నించారు. 2019 ఎంపీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వైపు నిలబడ్డారని, 2020 మున్సిపల్ ఎన్నికల్లోనూ నైతికంగా తామే గెలిచామన్నారు. నిజామాబాద్ బీజేపీ అడ్డా అని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తామే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికలకు బీఆర్‌ఎస్ నుంచి కనీసం పార్టీ అభ్యర్థులు కూడా లేరన్నారు. ఇప్పటికే తాము అత్యధికంగా పార్టీ మెంబర్షిప్ చేశామని తెలిపారు. సమావేశంలో కార్పొరేటర్లు మధు, నారాయణ, సాయివర్ధన్, రాఘవేందర్, బంటు, ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ సంస్కృతినే కొనసాగిస్తున్న కాంగ్రెస్
Advertisement
Advertisement