Bjp | ముస్లింలకు బీజేపీ రంజాన్ తోఫా

Bjp | ముస్లింలకు బీజేపీ రంజాన్ తోఫా
Bjp | ముస్లింలకు బీజేపీ రంజాన్ తోఫా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bjp | దేశవ్యాప్తంగా ముస్లింలు(Muslims) ఈ నెల 31 రంజాన్​ పండుగను ఘనంగా జరుపుకోనున్నారు. పండుగ​ నేపథ్యంలో ముస్లింలకు రంజాన్​ తోఫా ఇవ్వాలని బీజేపీ(Bjp) నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 32 లక్షల పేద ముస్లింలకు రంజాన్ తోఫా ఇవ్వడానికి ఏర్పాట్లు చేసింది. బుధవారం ఢిల్లీ(Delhi)లో కిట్ల పంపిణీని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) ప్రారంభించనున్నారు. సౌగాత్ ఈ మోదీ క్యాంపెయిన్ పేరుతో రంజాన్​ తోఫా కిట్లను బీజేపీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్నారు. ఈ కిట్లలో పురుషులు, స్త్రీలకు దుస్తులు, సేమియా, ఖర్జూర, ఎండు ఫలాలు, చక్కెర తదితరు వస్తువులు ఉండనున్నాయి.

Advertisement
Advertisement
Advertisement