అక్షరటుడే, ఇందూరు: నిజామాబాద్ అర్బన్ లో 60 వేల పార్టీ సభ్యత్వ నమోదు చేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్ అన్నారు. గురువారం బీజేపీ కంఠేశ్వర్ మండల కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ కార్యకర్త సభ్యత్వ నమోదులో నూతనోత్తేజంతో పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు రోషన్ లాల్ బోర, జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, నాగరాజు, కార్పొరేటర్ ఆకుల శ్రీనివాస్, సాయిరాం, నరేష్ తదితరులు పాల్గొన్నారు.