Advertisement

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ముధోల్ నియోజకవర్గంలోని హిందూ ఆలయాల్లో దాడులు, దొంగతనాలు సహించేది లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భోస్లే మోహన్ రావు పటేల్ అన్నారు. పట్టణ సమీపంలోని నాగదేవత ఆలయంలో చోరీ ఘటన అధికారులు, పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శమన్నారు. పట్టణంలోని నర్సింహస్వామి ఆలయంలో చోరీ జరిగి రెండు నెలలు గడుస్తున్నా.. నిందితులను పట్టుకోలేదన్నారు. ఇప్పటికైనా నియోజకవర్గంలోని అన్ని హిందూ దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. బాసర పుణ్యక్షేత్రంలో గోవధ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.

Advertisement