అక్షరటుడే, బోధన్: ఆరు గ్యారంటీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు విమర్శించారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఆరు గ్యారంటీల పేరుతో మోసం చేసిందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాశ్ రెడ్డి, మోహన్ రెడ్డి, అట్లూరి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి, పట్టణాధ్యక్షుడు బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.