అక్షరటుడే, ఇందూరు: బీజేపీ రాష్ట్ర కార్యాలయ రోడ్డుకు గద్దర్ పేరు పెట్టే ముందు కాంగ్రెస్ భవన్కు పెట్టాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గద్దర్ మీద రాజద్రోహం కేసు ఎవరు పెట్టారని ప్రశ్నించారు. వారి హయాంలో ఆయనపై సుమారు 35 కేసులు నమోదు చేశారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అవకాశవాది అని, రాజకీయ సంచార జీవి అని విమర్శించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, ఆయా మండలాలు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ భవన్కు గద్దర్ పేరు పెట్టాలి
Advertisement
Advertisement