అక్షరటుడే, కామారెడ్డి: జిల్లాలోని అన్ని మండలాల్లో నూతనంగా బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. శనివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో సభ్యత్వ నమోదు, సంస్థాగత ఎన్నికలు, బూత్ కమిటీలు, మండల కమిటీల ఎన్నిక అంశాలపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒక బూత్ లో 100 ప్రాథమిక సభ్యత్వాలు పూర్తయ్యాకే కమిటీ ఎన్నిక జరగాలన్నారు. బూత్ కమిటీల అనంతరం అందరి సమన్వయంతో మండల కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా అధ్యక్షురాలు అరుణాతార తదితరులు పాల్గొన్నారు.