అక్షరటుడే, బాన్సువాడ: ఏకకాలంలో రైతు రుణమాఫీ రూ.40 వేల కోట్లు చేస్తామని చెప్పి కేవలం రూ.15,800 కోట్లు మాత్రమే మాఫీ చేశారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ అన్నారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు కూలీలకు రూ.12 వేలు, కౌలు రైతులకు భరోసా ఇస్తామని చెప్పి మాట తప్పారని పేర్కొన్నారు. రైతులను మభ్యపెట్టి వారి జీవితాలతో ఆడుకుంటున్నారని, రైతులను అన్ని విధాలా ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మక్కన్న, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి హన్మాండ్లు, బీజేపీ నియోజక కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, గంగారెడ్డి, ప్రసాద్, చిదుర సాయిలు తదితరులు పాల్గొన్నారు.