నితిన్ గడ్కరీ సభ ఏర్పాట్ల పరిశీలన

0

అక్షరటుడే, ఇందూరు: నిజామాబాద్లోని పాత కలెక్టరేట్ మైదానంలో గురువారం నిర్వహించనున్న విజయ సంకల్ప యాత్ర ముగింపు సభకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హాజరు కానున్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా బుధవారం సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముగింపు సభకు కేంద్ర మంత్రితో పాటు జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్, ఎంపీ ధర్మపురి అరవింద్, రాష్ట్ర నాయకులు హాజరవుతారని తెలిపారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సభను విజయవంతం చేయాలని కోరారు. మరోవైపు బీజేపీ సభ నేపథ్యంలో నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.