అక్షరటుడే, కామారెడ్డిటౌన్: దేశభక్తిని పెంపొందించేందుకే హర్‌ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార పేర్కొన్నారు. బీజేవైఎం ఆధ్వర్యంలో తిరంగా బైక్ ర్యాలీని చేపట్టారు. పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్ వరకు నిర్వహించారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం అరుణతార మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకే హర్‌ఘర్ తీరంగా కార్యక్రమం నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని పేర్కొన్నారు. ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.