అక్షరటుడే, కామారెడ్డిటౌన్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్‌ను తక్షణమే అమలు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ ఆలిండియా మెంబర్ ముదిగంటి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. బీకేఎస్ కామారెడ్డి జిల్లా మహాసభ నిర్వహణ కోసం ఆదివారం పట్టణంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాక్షాత్తు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. వరంగల్‌లో ప్రకటించిన విధంగా రైతులందరికీ ఎలాంటి నిబంధనలు లేకుండా వెంటనే రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యానికి ప్రతి క్వింటాలుకు రూ. 500 బోనస్, రైతు భరోసా కింద ఎకరానికి రూ. 15వేలు, ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా పునరుద్ధరణపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. సమావేశంలో బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు లొంక వెంకట్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఆనందరావు, కొమిరెడ్డి అంజన్న, గైని నగేశ్, విఠల్‌రెడ్డి, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.