అక్షరటుడే, ఎల్లారెడ్డి: BKS | లింగంపేట మండలంలో మంగళవారం భారతీయ కిసాన్ సంఘ్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మోతే, లింగంపేట్, శెట్పల్లి, తదితర గ్రామాల్లో రైతులు జెండాలు ఆవిష్కరించారు. మోతే గ్రామానికి చెందిన విశ్రాంత ఉద్యోగి గడ్డం గోపాల్ రెడ్డి, రాధవ్వ దంపతులను కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో లింగంపేట మండల అధ్యక్షుడు సాయిరెడ్డి, రాజాగౌడ్, రాజిరెడ్డి, పోశెట్టి, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement